మరో వ్యాపారాన్ని మూసేయాలని నిర్ణయించింది అమెజాన్ కంపెనీ. హోల్ సేల్ ఈ కామర్స్, డిస్ట్రిబ్యూషన్ వ్యాపారాలను సైతం నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. అమెజాన్ ప్రస్తుతం బెంగళూరు, మైసూరు, హుబ్లి ప్రాంతాల్లోనే ఈ సేవలు అందిస్తోంది. ఈ వ్యాపారం మూసివేత ఒక విధంగా స్థానిక వ్యాపారులకు అనుకూలమనే భావించాలి. వేగంగా వినియోగమయ్య ఉత్పత్తులను కంపెనీల నుంచి నేరుగా కొనుగోలు చేసి, వాటిని స్థానిక కిరాణా షాపులు, ఫార్మసీలు, డిపార్ట్ మెంటల్ స్టోర్లకు అమెజాన్ సరఫరా చేస్తుంటుంది. అమెరికా ఆర్థిక మాంద్యం ముంగిట్లో ఉంది. దీనికితోడు భారత మార్కెట్ లో అమెజాన్ ఇప్పటి వరకు రూపాయి లాభం కళ్ల చూడలేదు. పైగా ఏటేటా భారీ నష్టాలు పోగేసుకుంటోంది. ఈ తరుణంలో వ్యాపార పునర్ వ్యవస్థకీరణలో భాగంగా నష్టాలు, వ్యయాలను పరిమితం చేసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
మరో వ్యాపారాన్ని మూసివేయనున్న అమెజాన్.. ఈ కామర్స్.. డిస్ట్రిబ్యూషన్ వ్యాపారాలు రద్దు
Advertisement
తాజా వార్తలు
Advertisement