దేశంలోని ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అయిన అమెజాన్, తమ వినియోగదారుల కోసం సరికొత్త సేల్ ను ఈ రోజు నుంచి అందుబాటులోకి తెచ్చింది. ఈ సేల్ లో మొబైల్స్, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై మంచి డిస్కౌంట్లు ఉన్నాయి. ఇవ్వల్టి నుండి స్టార్ట్ అయిన ఈ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఆగస్టు 8 వరకు జరగనుంది. ఈ సేల్ ద్వారా అమెజాన్ స్మార్ట్ ఫోన్స్, ల్యాప్ టాప్స్, టీవీలు, స్మార్ట్ వాచ్లు, ఆడియో పరికరాలతో పాటు మరికొన్ని ఇతర ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్ లను అందిస్తుంది.
ఇక ఎస్బీఐ క్రెడిట్ కార్డు లేదా ఈఎంఐ ద్వారా వస్తువులను కొనుగులు చేస్తే అదనంగా 10 శాతం డిస్కౌంట్ ను పొందవచ్చు. ఇక ఈ సేల్ లో ప్రీమియం స్మార్ట్ ఫోన్లు.. తక్కువ ధరకు మంచి ల్యాప్ టాప్ కొనాలని ఎదురుచూస్తున్న వారికి అదిరిపోయే డీల్స్ ఉన్నాయి. మరి పలు ల్యాప్ టాప్ లు.. స్మార్ట్ ఫోన్ల పై అమెజాన్ అందిస్తోన్న డిస్కౌంట్స్ ఏంటో చూద్దాం..
ప్రీమియం స్మార్ట్ ఫోన్లు..
ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ :
అమెజాన్ ఆఫర్స్ లో భాగంగా ఆపిల్ ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ప్రస్తుతం రూ. 1,27,999 ధరకు అందుబాటులో ఉంది.
హెచ్డీఎఫ్సీ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసినట్లైతే, అదనంగా రూ.3000 డిస్కౌంట్ ను పొందవచ్చు. పాత స్మార్ట్ ఫోన్ ను ఎక్స్చేంజ్ చేసినట్లయితే, రూ. 54,950 వరకు డిస్కౌంట్ ను అమెజాన్ అందిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా 5జీ :
ప్రస్తుతం అమెజాన్ లో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా 5జీ బేస్ వేరియంట్ ధర రూ. 1,24,999 లుగా ఉంది.
ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసినట్లయితే, అదనంగా రూ. 8000 డిస్కౌంట్ ను పొందవచ్చు. ఒకవేళ పాత స్మార్ట్ ఫోన్ ను ఎక్స్చేంజ్ చేసినట్లయితే, రూ. 64,950 వరకు డిస్కౌంట్ ను అమెజాన్ అందిస్తుంది.
మోటోరోలా రేజర్ 40 అల్ట్రా :
ప్రస్తుత సేల్ లో మోటోరోలా రేజర్ 40 అల్ట్రా బేస్ వేరియంట్ ధర రూ. 89,999 లుగా ఉంది.
ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసినట్లయితే, అదనంగా రూ.7000 డిస్కౌంట్ ను పొందవచ్చు. పాత స్మార్ట్ ఫోన్ ను ఎక్స్చేంజ్ చేసినట్లయితే, రూ. 54,950 వరకు డిస్కౌంట్ ను అమెజాన్ అందిస్తుంది.
వన్ ప్లస్ 11 5జీ :
అమెజాన్ లో వన్ ప్లస్ 11 5జీ బేస్ వేరియంట్ ధర రూ. 56,999 లుగా ఉంది.
హెచ్ఎస్బీసీ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డు ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసినట్లయితే, అదనంగా 5 శాతం డిస్కౌంట్ ను పొందవచ్చు. పాత స్మార్ట్ ఫోన్ ను ఎక్స్చేంజ్ చేసినట్లయితే, రూ. 54,149 వరకు డిస్కౌంట్ ను అమెజాన్ అందిస్తుంది.
ఐక్యూ 9 ప్రో 5జీ :
అమెజాన్ లో ఐక్యూ 9 ప్రో 5జీ బేస్ వేరియంట్ అయిన ధర రూ.44,990 లుగా ఉంది.
హెచ్ఎస్బీసీ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డు ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసినట్లయితే, అదనంగా 5 శాతం డిస్కౌంట్ ను పొందవచ్చు. పాత స్మార్ట్ ఫోన్ ను ఎక్స్చేంజ్ చేసినట్లయితే, రూ. 40,200 వరకు డిస్కౌంట్ ను అమెజాన్ అందిస్తుంది.
ల్యాప్ టాప్..
హెచ్ పీ 15ఎస్..
ఈ ల్యాప్ టాప్ అసలు ధర రూ. 66,599.. కాగా, డిస్కౌంట్లో రూ. 52,499 కే లభిస్తోంది. అమెజాన్ సేల్ లో ఈ ల్యాప్ టాప్ పై దాదాపు 14 వేల డిస్కౌంట్ లభిస్తోంది.
ఐ5 11వ జనరేషన్ ప్రాసెసర్ తో వచ్చిన ఈ ల్యాప్ టాప్ 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజీతో వస్తోంది. విండోస్ 11 హోం ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. 15.6 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ ప్లే, 720 పిక్సెల్ హెచ్డీ కెమెరా, ఇంటెల్ ఐరిస్ ఎక్స్ఈ గ్రాఫిక్స్, డ్యూయల్ స్పీకర్స్ వంటి ఫీచర్లున్నాయి.
లెనోవో యోగా స్లిమ్ 7 ప్రో
ఈ ల్యాప్ టాప్ అసలు ధర రూ. 1,06,209.. కాగా, అమెజాన్ సేల్ డిస్కౌంట్ లో రూ. 68,990 కే లభిస్తోంది.
చాలా తేలికగా, పలుచగా ఆకర్షణీయమైన డిజైన్ ను కలిగి ఉంటుంది. 14 అంగుళాల 2.8 కే ఐపీఎస్ డిస్ ప్లే విత్ 90 హెడ్జ్ రీఫ్రెష్ రేట్ తో వస్తుంది. 11 వ జనరేషన్ ఐ5 ప్రాసెసర్ ను కలిగి ఉంది. 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజీ, విండోస్ 11 హోం ఆపరేటింగ్ సిస్టం, మూడు నెలల ఎక్స్ బాక్స్ సబ్ స్క్రిప్షన్, ఇంటెల్ ఐరిస్ ఎక్స్ఈ గ్రాఫిక్స్ వంటి ఫీచర్లున్నాయి.
ఏసస్ వివోబుక్ 16 ఎక్స్
ఈ ల్యాప్ టాప్ అసలు ధర రూ. 68,990.. కాగా, అమెజాన్ సేల్ డిస్కౌంట్ లో రూ. 46,990 కే లభిస్తోంది.
ఏఎండీ రైజెన్ 5 5600 హెచ్ ప్రాసెసర్ తో ఈ ల్యాప్ టాప్ ను రూపొందించారు. 8 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజీ, 16 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ ప్లే, విండోస్ 11 హోం ఆపరేటింగ్ సిస్టం వంటి ఫీచర్లున్నాయి.
ఎఎస్ఐ మోడర్న్ 14
ఈ ల్యాప్ టాప్ అసలు ధర రూ. 67,990.. కాగా, అమెజాన్ సేల్ డిస్కౌంట్ లో రూ. 45, 990 కి లభిస్తోంది.
ఇంటెల్ కోర్ ఐ5 12 వ జనరేషన్ ప్రాసెసర్ తో ఈ ల్యాప్ టాప్ వస్తోంది. 8 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజీ, 14 అంగుళా ఫుల్ హెచ్డీ డిస్ ప్లే, విండోస్ 11 హోం ఆపరేటింగ్ సిస్టం, ఐరిస్ ఎక్స్ఈ గ్రాఫిక్స్, వంటి ఫీచర్లున్నాయి.
శాంసంగ్ గేలాక్సీ బుక్ 2 ప్రో
ఈ ల్యాప్ టాప్ అసలు ధర రూ. 1,39,940.. కాగా, అమెజాన్ సేల్ డిస్కౌంట్ లో రూ. 99,490 కి లభిస్తోంది.
ఇంటెల్ కోర్ ఐ7 12వ జనరేషన్ ప్రాసెసర్ తో ఈ ల్యాప్ టాప్ వచ్చింది. 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజీ, 13.3 అంగుళాల ఫుల్ హెచ్ డీ అమోల్డ్ డిస్ ప్లే, ఇంటెల్ ఐరిస్ ఎక్స్ఈ గ్రాఫిక్స్ వంటి ఫీచర్లున్నాయి.