ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ తమ యూజర్లకు బ్యాడ్ న్యూస్ అందించింది. ఇకపై అమెజాన్ ప్రైమ్‌లో నెలవారీ సబ్స్క్రిప్షన్ ఉండదని వెల్లడించింది. అదేవిధంగా తన కొత్త కస్టమర్ల కోసం ఇచ్చే ఫ్రీ ట్రయల్‌ను కూడా తాత్కాలికంగా తొలగిస్తున్నట్టు ప్రకటించింది. సాధారణంగా అన్ని ఓటీటీలు ఏడాది సబ్స్క్రిప్షన్ విధానాన్ని అందిస్తాయి. కొన్ని ఓటీటీలు మాత్రం మూడు నెలలు, ఆరు నెలల సబ్స్క్రిప్షన్ విధానాన్ని కూడా అందిస్తాయి. కానీ అమెజాన్ తన కస్టమర్ల కోసం నెలవారీ సబ్స్క్రిప్షన్ విధానాన్ని ఇస్తూ వచ్చింది. ఏడాది పాటు సబ్స్క్రిప్షన్ పొందలేని కస్టమర్లు నెలరోజుల ప్యాక్ తీసుకునే వారు. వారిప్పుడు ఇకపై మూడు నెలల ప్లాన్ లేదా ఏడాది ప్లాన్‌కు మారాల్సి ఉంటుంది. ఆర్బీఐ నూతన మార్గదర్శకాలకు లోబడి అమెజాన్ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా గతంలో అమెజాన్ మంత్లీ సబ్స్క్రిప్షన్ రూ.129, మూడు నెలల సబ్స్క్రిప్షన్ రూ.329, ఏడాది సబ్స్క్రిప్షన్ రూ.999గా ఉండేది.
Advertisement
తాజా వార్తలు
Advertisement