Friday, November 22, 2024

అమెజాన్‌ లేఆఫ్‌లు ఇండియాలోనే ఎక్కువ.. భారీగా ఉద్యోగాల కోతకు రంగం సిద్ధం

అమెజాన్‌ 10 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్న చేసిన ప్రకటన భారత్‌లో ఎక్కువ ప్రభావం చూపనుంది. మన దేశంలో అమెజాన్‌ అనేక కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అమెజాన్‌ ఇ-కామర్స్‌ సైట్‌తో పాటు, వీడియో స్ట్రీమింగ్‌, వెబ్‌ సర్వీసెస్‌ నిర్వహిస్తోంది. ఇతర టెక్‌ సంస్థల కంటే అమెజాన్‌ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. భారత్‌లో ఎంత మందిని తొలగించాలన్న దానిపై ఇంకా సంఖ్య తేలలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.

అమెజాన్‌ ఇండియాలో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మంది పని చేస్తున్నారు. మన దేశంలో అమెజాన్‌ బెంగళూర్‌ కేంద్రంగా పని చేస్తోంది. అమెజాన్‌ అన్ని విభాగాల నుంచి ఉద్యోగుల తొలగింపు ఉంటుందని న్యూయార్క్​ టైమ్స్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. ఆర్ధిక మాంద్యం భయాల నేపథ్యంలో పలు టెక్‌ సంస్థలు భారీగా ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. 11 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు మెటా గత వారంలో ప్రకటించింది. ట్విటర్‌ కొత్త యాజమాని ఎలాన్‌ మస్క్‌ ఇప్పటికే సగం మంది ఉద్యోగులను తొలగించారు. అమెజాన్‌లో మూడు నెలలుగా కొత్త నియామకాలు చేనయడంలేదు. ఉన్న ఉద్యోగులనే వివిధ విభాగాల్లోకి రీలోకేట్‌ చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement