Tuesday, November 26, 2024

Amazon Great Indian Festival : అమెజాన్‌లో అదిరిపోయే డీల్స్.. మీరు ఓ లుక్కేయండి..!

హైదరాబాద్ : భారతదేశంలో అతిపెద్ద ఆన్‌లైన్ వేడుక- ది గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (GIF)లో భాగంగా, హైదరాబాద్‌లోని తన వినియోగదారుల కోసం ‘ది అమెజాన్ మెటా వరల్డ్’ అనుభవాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నామని అమెజాన్ ఇండియా నేడు ప్రకటించింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (GIF) సెప్టెంబర్ 23న ప్రారంభం కాగా, స్మార్ట్ ఫోన్‌లు, గృహోపకరణాలు, టీవీలు, కన్సూమర్ ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ మరియు బ్యూటీ, అమెజాన్ పరికరాలు, ఇల్లు, వంటగది ఉత్పత్తులు, కిరాణా సామాగ్రి తదితర వర్గాలలో ప్రముఖ బ్రాండ్‌ల ఉత్పత్తుల విస్తృత ఎంపికపై ఆకర్షణీయమైన డీల్స్‌ అందిస్తోంది. అన్ని డీల్స్‌ను చూడండి. దీని గురించి అమెజాన్ ఇండియా డైరెక్టర్ కిషోర్ తోట మాట్లాడుతూ “దేశ వ్యాప్తంగా 11 లక్షల మంది విక్రేతలు, 2 లక్షల స్థానిక స్టోర్లతో, ది గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లక్షలాది విక్రేతలు వేడుకలు జరుపుకునేలా, విక్రయాలు కొనసాగిస్తోంది. భారతీయ ఎస్ఎంబీలు, స్థానిక స్టోర్‌ల నుంచి ప్రత్యేకమైన ఉత్పత్తులతో సహా Amazon.in ద్వారా కోట్లాది ఉత్పత్తులను వినియోగదారులకు అందిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే తెలంగాణలోనే మా వినియోగదారులకు సేవలందిస్తున్న విక్రేతలు 25% పెరిగారు. నెలరోజుల పాటు కొనసాగే పండుగ సీజన్‌లోకి అడుగుపెట్టినప్పుడే మా వినియోగదారులకు ఎప్పుడైనా ఎక్కడి నుంచి అయినా షాపింగ్ చేసే సౌలభ్యం మరియు భద్రతతో గొప్ప విలువతో విస్తృత ఎంపికలను అందించేందుకు మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాము’’ అని వివరించారు. ‘‘అమెజాన్ ఇండియాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలు ఒక కీలకమైన మార్కెట్. హైదరాబాద్‌లోని మా వినియోగదారులకు అమెజాన్ మెటావరల్డ్ అనుభవాన్ని అందించడం మాకు సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు.

అమెజాన్ లో ట్రెండ్‌లు ఇలా ఉన్నాయి..

  • పండుగ సీజన్‌కు ముందు, వినియోగదారులు Amazon.inలో మొబైల్ ఫోన్‌లు ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు మరియు వేరబుల్స్, ట్రూలీ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లు, వైర్డు మరియు వైర్‌లెస్ స్పీకర్లు, బ్లూటూత్ స్పీకర్లు, సౌండ్‌బార్‌ల కోసం షాపింగ్ చేస్తున్నారు.
  • వినియోగదారులు రెడ్‌మి, శామ్‌సంగ్, ఒన్‌ప్లస్, రియల్‌మీ మరియు ఐక్యూఓఓ తదితర బ్రాండ్‌ల నుంచి షాపింగ్ చేసారు. – – – – స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులు మిడ్-సెగ్మెంట్ స్మార్ట్‌ఫోన్‌లను (10-20k) ఇష్టపడుతున్నారు.
  • 5జి స్మార్ట్‌ఫోన్‌లు మధ్య-స్థాయి నుంచి ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లకు ప్రాధాన్యతనిస్తూ వినియోగదారుల నుంచి దృఢమైన ఆదరణను పొందాయి.
  • ఇంటి నుంచి పని, ఇంటి నుంచి చదువుకోవడం చాలా మందికి జీవన విధానంగా మారడంతో వినియోగదారులు హెచ్‌పి, లెనెవో, ఆసస్, డెల్ తదితర బ్రాండ్‌లలో ల్యాప్‌టాప్‌ల కోసం షాపింగ్ చేస్తున్నారు.
  • తెలంగాణలో అత్యధిక కొనుగోళ్లలో హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, వరంగల్ మరియు నల్గొండ నగరాలు వరుసగా అగ్రస్థానంలో ఉన్నాయి.
  • అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2022లో భాగంగా, వినియోగదారులు లక్షలాది స్మాల్ మీడియం బిజినెస్ (SMBలు, స్థానిక స్టోర్‌ల నుంచి పలు రకాల ఉత్పత్తులపై ఆకర్షణీయమైన డీల్స్ పొందవచ్చు.
  • గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్-2022(GIF), Amazon Launchpad, Amazon Saheli, Amazon Karigar వంటి అనేక ఇతర ప్రోగ్రామ్‌లలో భాగంగా అమెజాన్ విక్రేతల ఉత్పత్తులను కూడా ప్రదర్శిస్తోంది. అలాగే వివిధ కేటగిరీలలో అగ్రశ్రేణి భారతీయ మరియు ప్రపంచ బ్రాండ్‌లను ప్రదర్శిస్తోంది.
    బ్యాంకు నుంచి వినియోగ‌దారుల‌కు అద్భుత‌మైన ఆఫ‌ర్లు ఇవే…
    ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లు అలాగే, ఈఎంఐ లావాదేవీలపై 10% తక్షణ తగ్గింపు, డెబిట్, క్రెడిట్ కార్డ్‌లపై నో-కాస్ట్ ఈఎంఐ, ఇతర ప్రముఖ క్రెడిట్/డెబిట్ కార్డ్‌ల నుంచి అద్భుతమైన ఆఫర్‌లతో పాటు ఎస్‌బీఐ వంటి ప్రముఖ భాగస్వామ్య బ్యాంకుల నుంచి వినియోగదారులు అద్భుతమైన ఆఫర్‌లను అందుకుంటారు. Amazon.in గురించి…
    అమెజాన్ నాలుగు సూత్రాల ద్వారా మార్గనిర్దేశం చేయబడింది: పోటీదారుల దృష్టి కన్నా ఎక్కువగా వినియోగదారులను చేరుకోవడం, ఆవిష్కరణ పట్ల మక్కువ, కార్యాచరణ నైపుణ్యానికి నిబద్ధత మరియు దీర్ఘకాలిక ఆలోచన. అమెజాన్ సేవలు ఈ భూమిపై మోస్ట్ కస్టమర్-సెంట్రిక్ కంపెనీగా, భూమిపై బెస్ట్ ఎంప్లాయర్‌గా, పని చేసేందుకు ఈ ప్రపంచంలో సురక్షితమైన ప్రదేశంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది. కస్టమర్ రివ్యూలు, 1-క్లిక్ షాపింగ్, పర్సనలైజ్ సిఫార్సులు, ప్రైమ్, అమెజాన్, ఎడబ్ల్యూఎస్, కిండల్ డైరెక్ట్ పబ్లిషింగ్, కిండల్, కెరీర్ ఛాయిస్, ఫైర్ ట్యాబ్లెట్స్, ఫైర్ టీవీ, అమెజాన్ ఎకో, అలెక్సా, జస్ట్ వాక్ ఔట్ టెక్నాలజీ, అమెజాన్ స్టూడియోస్, ది క్లైమేట్ ప్లెడ్జ్ ద్వారా నెరవేర్చడం అమెజాన్ అందుబాటులోకి తీసుకు వచ్చిన కొన్ని అంశాలు. మరింత సమాచారం కోసం, www.amazon.in/aboutusను సందర్శించండి
    అమెజాన్ వార్తల కోసం, www.twitter.com/AmazonNews_INను అనుసరించండి.
    డిస్‌క్లెయిమర్ : ఎగువ పేర్కొన్న సమాచారం, డీల్స్, డిస్కౌంట్‌లు విక్రేతలు, లేదా బ్రాండ్‌ల ద్వారా అందించబడ్డాయి, అమెజాన్ ద్వారా ‘ఉన్నది ఉన్నట్లుగా’ ప్రదర్శించ బడతాయి. అమెజాన్ ఈ క్లెయిమ్‌లను ఆమోదించదు, అటువంటి క్లెయిమ్‌లు, సమాచారానికి సంబంధించిన కచ్చితత్వం, విశ్వసనీయత లేదా చెల్లుబాటుకు సంబంధించి ఎటువంటి ప్రాతినిధ్యాలను అందించదు, వాటికి సంబంధించి ఏవైనా గ్యారెంటీలు లేదా వారెంటీలను అందించదు. స్టాక్‌లు ఉండే వరకు ఆఫర్ చెల్లుబాటు అవుతుంది. ‘Amazon.in అనేది ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్, స్టోర్ అనే పదం విక్రయదారులు అందించే ఎంపికతో స్టోర్ ఫ్రంట్‌ను సూచిస్తుంది.
Advertisement

తాజా వార్తలు

Advertisement