రిలయన్స్, ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ ఒప్పంద విషయంలో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యతిరేకిస్తోన్న విషయం తెలిసిందే. రిలయన్స్ తో ఒప్పదం విషయంలో ముందుకు వెళ్లొద్దని ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ కు ఢిల్లీ హై కోర్టు ఇదివరకే ఆదేశించింది. అయితే ఇప్పుడు దీనిపై దాంతో ఫ్యూచర్ గ్రూప్ ఢిల్లీ హైకోర్టులోని ఉన్నత ధర్మాసనాన్ని ఆశ్రయించగా, ఆ పిటిషన్ పై నేడు విచారణ జరిగింది. వాదోపవాదాలు విన్న మీదట సింగిల్ బెంచ్ ఇచ్చిన ఒప్పందం నిలుపుదల ఆదేశాలపై చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ జస్మీత్ సింగ్ లతో కూడిన ఉన్నత ధర్మాసనం స్టే ఇచ్చింది..ఈ ఒప్పందం పట్ల అభ్యంతరాలేంటో చెప్పాలని అమెజాన్ కు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను ఏప్రిల్ 30కి వాయిదా వేసింది. ఫ్యూచర్ గ్రూప్ అధినేత కిశోర్ బియానీ తదితరుల ఆస్తులను అటాచ్ చేయాలన్న ఏకసభ్య ధర్మాసనం ఆదేశాలపైనా ఉన్నత ధర్మాసనం స్టే ఇచ్చింది. వారిని ఏప్రిల్ 28న కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement