హైదరాబాద్, ప్రభన్యూస్ : మే నెల 18, 19 తేదీల్లో అమెజాన్ సంభవ్ సదస్సు మూడో ఎడిషన్ నిర్వహించనున్నట్లు అమెజాన్ ఇండియా ప్రకటించింది. రెండు రోజుల పాటు వర్చువల్ పద్దతిలో నిర్వహించే ఈ మెగా సదస్సులో విధాన నిర్ణేతలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పరిష్కారకర్తలు, స్టార్టప్‌లు, అమెజాన్ నాయకులు పాల్గొంటారు. ఈసందర్భంగా అమెజాన్ ఇండియా కన్స్యూమర్ బిజినెస్ కంట్రీ మేనేజర్ మనీష్ తివారీ మాట్లాడుతూ… చిన్న వ్యాపారాల కోసం సరికొత్త ఆవిష్కరణలు చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు.
అందుకోసం చిన్న స్థానిక దుకాణాలు, కిరాణా దుకాణాలను డిజిటల్‌గా ఎనేబుల్ చేస్తామన్నారు. 2022 అమెజాన్ సంభవ్ సదస్సులో విధాన నిర్ణేతలు, ప్రముఖ కార్పొరేట్ నాయకులు, విజయవంతమైన ఆధునిక పారిశ్రామికవేత్తలు, యువ వర్ధ మాన వ్యాపార యజమానులు, అమెజాన్ నాయకులను ఒక చోటకు తీసు కువస్తున్నందుకు తాము సంతోషిస్తున్నామన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..