Friday, October 18, 2024

T20 WC | పాక్‌పై అద్భుత విజ‌యం.. సెమీస్‌కు కివీస్ !

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఈరోజు జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఘ‌న‌ విజయం సాధించింది. లోస్కోరింగ్ మ్యాచ్ లో త‌మ స్కోర్ ను అద్భుతంగా డిఫెండ్ చేసుకున్న కివీస్… పాక్ ను 56/10 కే అలౌట్ చేసి చిత్తుగా ఓడించింది.

దీంతో సెమీస్ చేరాలన్న భారత్ ఆశలు కూడా గల్లంతయ్యాయి. ఈ విజయంతో గ్రూప్‌-ఎలోని న్యూజిలాండ్‌ సెమీస్‌కు దూసుకెల్ల‌గా… ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది.

కాగా, నేటి మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 110/6 ప‌రుగులు చేసింది. దీంతో స్వల్ప టార్గెట్ తో పాకిస్థాన్ బ‌రిలోకి దిగింది. అయితే, మొద‌ట కివీస్‌ను త‌క్కువ‌కే ప‌రుగుల‌కే క‌ట్ట‌డి చేసిన పాకిస్థాన్ బ్యాటింగ్‌లో గోరంగా విఫ‌ల‌మైంది. ఆదిలోనే పాక్ టాపార్డ‌ర్ పెవిలియ‌న్‌కు క్యూ క‌ట్టింది. కాసేపు క్రీజ్ లో ఉండి ప‌ర‌గులు సాధించిన‌ కెప్టెన్ ఫాతిమా స‌నా(21) కూడా 9వ వికెట్‌గా ఔటైంది. దీంతో పాక్ 56 పరుగుల‌కే ఆలౌట్ అయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement