Wednesday, July 3, 2024

TG | అద్భుతం… ‘కల్కి’ ఓ విజువల్ వండర్ : మంత్రి కోమటిరెడ్డి

నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ మూవీని కుటుంబసమేతంగా చూసినట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. మహాభారతాన్ని, భవిష్యత్ కాలాన్ని సమ్మిళితం చేస్తూ నాగ్‌అశ్విన్ అద్భుతంగా తెరకెక్కించారని కొనియాడారు. లెజెండరీ నటులు అమితాబ్, కమల్ హాసన్, దీపిక నటించిన మూవీ విజువల్ వండర్ అని ట్వీట్ చేశారు. సినిమాలు విజయవంతం అయితేనే లక్షల మందికి ఉపాధి లభిస్తుందని, ప్రతిఒక్కరూ ఈ మూవీ చూడాలని కోరారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement