డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 పోరులో టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ శతకొట్టాడు. సఫారీ బౌలర్లను ఉతికి ఆరేస్తూ… వీర విహారం చేశాడు. దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు భారీ స్కోరు నమోదు చేసింది.
ఓపెనర్ సంజూ శాంసన్ తొలి ఓవర్ల నుంచే ఆకాశమే హద్దురా అన్నట్టుగా బౌండరీల మోత మోగించాడు. అతను 50 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్సర్లతో 101* పరుగుల అద్భుత సెంచరీ నమోదు చేశాడు. ఇక కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (17 బంతుల్లో 21 పరుగులు), తిలక్ వర్మ (18 బంతుల్లో 33 పరుగులు) రాణించారు.
రింకూ సింగ్ (11 పరుగులు) చేయగా, మిగతా వారెవరూ రెండంకెల పరుగులు చేయలేకపోయారు. అయితే భారత్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ నష్టానికి 202 పరుగులు భారీ స్కోర్ నమోదు చేసింది.
ఆథిద్య జట్టు బౌలర్లలో కేశవ్ మహారాజ్, మార్కో జాన్సెన్, న్కాబా పీటర్, పాట్రిక్ క్రూగర్ తలో వికెట్ సాధించగా.. గెరాల్డ్ కోయెట్జీ మూడు వికెట్లు దక్కించుకున్నాడు. కాగా, 203 పరుగుల టార్గెట్ తో దక్షినాఫ్రికా జట్టు చేజింగ్ కు దిగనుంది.