Friday, November 22, 2024

Amarnath yatra – పునఃప్రారంభమైన అమర్‌నాథ్‌ యాత్ర

జమ్మూ-కశ్మీర్‌ – ప్రతికూల వాతావరణం కారణంగా మూడురోజులుగా నిలిచిపోయిన అమర్‌నాథ్‌ యాత్ర ఆదివారం పునఃప్రారంభమైంది. జమ్మూ-కశ్మీర్‌లోని పంజ్‌తర్ణి, శేష్‌నాగ్‌ క్యాంపుల నుంచి యాత్రికులు బయల్దేరారు పంజ్‌తర్ణిలో దాదాపు 1500 మంది చిక్కుకుపోగా.. వీరిలో దాదాపు 200 మంది తెలుగువారు ఉన్నారు. అమర్‌నాథ్‌ ఆలయం వద్ద వాతావరణం సానుకూలంగా మారిన వెంటనే అధికారులు గేట్లను తెరిచి భక్తులు హిమలింగానికి పూజలు చేసేందుకు అనుమతించారు.

మరోవైపు అనంతనాగ్‌లో సైన్యం తమ క్వాజిగుండ బేస్‌క్యాంప్‌లో 700 మంది యాత్రికులకు ఆశ్రయం కల్పించింది. భారీ వర్షాల కారణంగా వారి యాత్ర నిలిచిపోయింది. మరోవైపు జమ్మూ-శ్రీనగర్‌ జాతీయ రహదారి మూతపడింది. దీంతో జమ్మూ నుంచి కొత్తగా యాత్రికులను మాత్రం ముందుకు అనుమతించడంలేదు

Advertisement

తాజా వార్తలు

Advertisement