పంజాబ్ లో వచ్చే ఏడాది జరగబోయే శాసనసభ ఎన్నికల్లో బీజేపీతో కలసి పోటీ చేయాలని నిర్ణయించామని, సీట్ల పంపకంపై ఇరుపక్షాల మధ్య త్వరలో అవగాహన కుదురుతుందని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ శింగ్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో శుక్రవారం ఆయన బీజేపీ నేత, కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో భేటీ అనంతరం ఈ విషయం వెల్లడించారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఆయన బీజేపీతో సాన్నిహిత్యంగా మెలుగుతూండటం, ఒక దశలో ఆయన కమలదళంలో చేరుతారన్న ఊహాగానాలు వచ్చాయి.
అయితే సొంతంగా పార్టీ పెడతారని ఆ తరువాత ఆయన అనుచరులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నట్లు స్వయంగా అమరీందర్ సింగ్ వెల్లడించడం విశేషం. ఇరు పార్టీల మధ్య పొత్తు ఖాయమైంది. ఇక సీట్ల పంపకంపై అవగాహనకు వస్తాం. గెలుపే ప్రామాణికంగా సీట్ల పంపకం ఉంటుందని ఆయన వెల్లడించారు. ఇంతవరకూ అకాలీదళ్ తో కలసి పోటీ చేసిన సీట్ల పంపకంలో సర్దుకుపోవలసి వచ్చేది. ఇప్పుడు బీజేపీ సింహభాగం సీట్లను ఉంచుకుని అమరీందర్ సింగ్ పార్టీకి కొన్నింటిని కేటాయించాలని భావిస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital