Friday, November 22, 2024

ఉక్కు ప్రైవేటీకరణకు అమరావతి జేఏసీ వ్యతిరేకం

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఏర్పడిందని అన్నారు ఏపీ అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తుందని గుర్తు చేశారు.. కరోనా నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా చేసిందని తెలిపారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి రెండు సార్లు లేఖ రాశారని పేర్కొన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని, అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్తామని ప్రధానిని సమయం అడిగారని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని రాష్ట్ర క్యాబినెట్ కూడా వ్యతిరేకించిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంకు వ్యతిరేకంగా సీఎం జగన్ తీసుకున్న చర్యలు హర్షణీయం బొప్పరాజు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement