Tuesday, November 26, 2024

సుప్రీంకు అమరావతి రైతులుఆర్ 5 జోన్ వ్యవహారంపై పిటిషన్.. ఈ నెల 14న విచారణ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఇటీవల ఆర్ 5 జోన్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌పై అమరావతి రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 900 ఎకరాల భూములను ఆర్ 5 జోన్ పరిధిలోకి తెస్తూ గత నెల 21వ తేదీన రాష్ట్ర సర్కార్ గెజిట్ జారీ చేసింది.  దీనిపై రైతులు దాఖలు చేసిన పిటిషన్ గురువారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది.

సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాల కేటాయింపుపై రైతులు హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర హైకోర్టులో ఆర్5 జోన్‌పై మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇవ్వకపోవడంతో రైతులు సుప్రీంకు వచ్చారు. కేసుల జాబితా ఇప్పటికే తయారైనందున, విచారించాల్సిన కేసులు చాలా ఉన్నాయి కాబట్టి 14న విచారణకు తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement