అమరావతి: అధికారం అండతో గన్ను పెట్టి ఆస్తులు రాయించుకోవడం జగన్ కు మాత్రమే చెల్లిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్నడూ కనీవిని ఎరుగని విధంగా వ్యాపారాల్లో వాటాలు తీసుకున్న ఘటనలు దేశ చరిత్రలోనే లేవని అన్నారు.. అయితే జగన్ పాలనలో దీనిని తిరగరాశారని ఆరోపించారు.. అమరావతి లోని ఎన్టీఆర్ భవన్లో నేడు ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ, ఇటువంటి నేరాలు చేసిన వారిని కఠినంగా శిక్షించాల్సి ఉందని అన్నారు.
“కొత్త తరహా నేరాల పట్ల చర్యలపై ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తోంది. వ్యాపారాల్లో వాటాలు లాక్కోవడం ఇప్పుడే చూస్తున్నాం. ముంబయిలో మాపియా బృందాలు లాక్కునే ఆస్తులను సీజ్ చేసే చట్టం ఉంది. ఆ విషయంపై సమాచారం తెప్పించుకుంటాం” అని చెప్పారు. అలాగే అమరావతితో తాను స్థిర నివాసం ఏర్పరుచుకుంటునట్లు వెల్లడించారు.. ఇంటి నిర్మాణం కోసం స్థలం కొనుగోలు చేశామని ,త్వరలోనే శంఖుస్థాపన చేస్తామని చెప్పారు..