Saturday, November 23, 2024

వారం గ‌డువు ఇస్తే – విచార‌ణ‌కు వ‌స్తా – ఆమంచి కృష్ణ‌మోహ‌న్

వారం రోజులు గ‌డువు ఇస్తే తాను విచార‌ణ‌కు రాగ‌ల‌ని సీబీఐ కేంద్ర కార్యాల‌యానికి స‌మాచారం తెలిపారు వైసీపీ నేత‌, ప్ర‌కాశం జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ . ముందే నిర్ణ‌యించుకున్న ప్ర‌కారం ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొనాల్సి ఉంద‌ని, విచార‌ణ‌కు హాజ‌ర‌య్యేందుకు త‌న‌కు స‌మ‌యం కావాల‌ని ఆమంచి సీబీఐ కేంద్ర కార్యాయానికి స‌మాచారం చేర‌వేశారు.
ఆమంచి విజ్ఞ‌ప్తికి ఓకే చెప్పిన సీబీఐ అధికారులు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యేందుకు ఆయ‌న‌కు గ‌డువు మంజూరు చేసిన‌ట్లు స‌మాచారం. జ‌గ‌న్ స‌ర్కారు తీసుకున్న ప‌లు కీల‌క నిర్ణ‌యాల‌పై ఏపీ హైకోర్టు వ్య‌తిరేకంగా తీర్పు ఇచ్చిన నేప‌థ్యంలో హైకోర్టు న్యాయ‌మూర్తులు, న్యాయ వ్య‌వ‌స్థ‌ను కించ‌ప‌రిచేలా వైసీపీకి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టులు అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్య‌వ‌హారంపై హైకోర్టు ఆదేశాల‌తో సీబీఐ కేసులు న‌మోదు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement