కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు అండగా మున్నూరు కాపు సంఘం నిలుస్తుందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య పటేల్ అన్నారు. ఇవ్వాల (శుక్రవారం) హైదరాబాదులోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో వనమాని కలుసుకున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆయన వనమాతో చర్చించారు. కాగా, సుప్రీంకోర్టులో విజయం తమనే వరిస్తుందని, మున్నూరు కాపు సంఘం ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపి, సంఘీభావం ప్రకటించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement