Wednesday, November 20, 2024

చదువుతో పాటు క్రీడాభివృద్ధికి అధిక ప్రాధాన్యత : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్ ప్రతినిధి, ప్రభ‌ న్యూస్ : క్రీడలతో మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడమే కాకుండాఆరోగ్యపరంగా ఎంతో మేలు కలుగుతుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వేసవి ఉచిత క్రీడా శిక్షణ శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. మంత్రి కాసేపు క్యారమ్, చేసి ఆడి క్రీడాకారుల్లో జోష్ ను నింపారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ… విద్యార్థులకు చదువుతో పాటు క్రీడాలు కూడా చాలా ముఖ్యమన్నారు. 6 ఏళ్ల నుంచి 16 ఏళ్ల చిన్నారులకు నిర్మల్ వర్గంలో నియోజకవర్గంలో 110 గ్రామాల్లో వేసవి క్రీడా క్యాంపులను ఏర్పాటు చేసి వివిధ క్రీడాల్లో శిక్షణ ఇస్తున్నారన్నారు. ఇందులో భాగంగా అథ్లెటిక్స్, బాల్ బ్యాడ్మింటెన్,, కరాటే, వాలీబాల్, క్యారమ్, తదితర 44 రకాల క్రీడల్లో శిక్షణ ఈ నెల31 వరకు ఉంటుందని, ఈ క్యాంప్‌లను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో విద్యార్థులకు శిక్షణ సమయంలో తగిన జాగ్రత్తలను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం క్రీడల అభివృద్ది కోసం అనేక చర్యలు తీసుకోవడందో పాటు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వరుణ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement