న్యూఢిల్లి, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా దాదాపు నిరంతరాయంగా జరుగుతోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. టీఆర్‌ఎస్ ఎంపీ నామ నాగేశ్వర రావు సహా పలువురు ఎంపీలు గురువారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ బదులిస్తూ ఈ విషయం వెల్లడించారు.
పట్టణ ప్రాంతాల్లో సగటున ప్రతిరోజూ 23.93 గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో 21.89 గంటల పాటు విద్యుత్ సరఫరా జరుగుతోందని తెలిపారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో సగటున ప్రతి రోజూ 23.89 గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో 23.62 గంటల పాటు విద్యుత్ సరఫరా జరుగుతోందని వివరించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.