అల్లూరి ఒక మహా అగ్ని కణం.. ఆయన తెలుగు గడ్డపై పుట్టడం గర్వకారణమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో ప్రధాని మోదీ, గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్ పాల్గొన్నారు. ఈసందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఒక మనిషిని.. ఇంకొక మనిషి.. ఒక జాతిని మరొక జాతి.. ఒక దేశాన్ని మరొక దేశం దోపిడీ చేయడానికి వీల్లేని సమాజాన్ని స్వాతంత్ర్య సమరయోధులు ఆకాంక్షించారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం లక్షలాది మంది ప్రాణాలు అర్పించారన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement