అల్లు స్టూడియోలో ప్రంపంచంలోని లేటెస్ట్ టెక్నాలజీ ఉండనుంది. గండిపేటకు సమీపంలో ఈ స్టూడియోను భారీగా నిర్మించారు. .అల్లు స్టూడియోస్ కోసం అల్లు అరవింద్.. హైదరాబాద్ శివారులోని గండిపేట ప్రాంతం దగ్గరలో 10 ఎకరాలను ఎప్పుడో కొనుగోలు చేసి పెట్టుకున్నారట. అక్కడే ఈ స్టూడియో నిర్మించారని సమాచారం. ఇప్పటికే హైదరాబాద్‌లో పలు స్టూడియోలున్న వాటికీ ధీటుగా.. దాదాపు రూ. 100 కోట్ల భారీ నిర్మాణ వ్యయంలో ఈ స్టూడియోను నిర్మించారు అల్లు కుటుంబం.
ఈ స్టూడియోని అక్టోబర్ 1 అల్లు రామలింగయ్యగారి జయంతి సందర్బంగా ఇనాగరేట్ చేయనున్నారు. ఈ ఈవెంట్ లో అల్లు అర్జున్, చిరంజీవి, అల్లు అరవింద్, మిగతా కుటుంబ సభ్యులు పాల్గొంటారు. అల్లు అర్జున్, అతని సోదరులు అల్లు వెంకటేష్, శిరీష్ ఈ స్టూడియోలో పార్టనర్స్. ఈ ‘అల్లు’ స్టూడియోలనే ఇకపై ‘ఆహా’ ఓటీటీకి సంబంధించిన ప్రొడక్షన్ వ్యవహారాలతో పాటు షూటింగ్స్‌ను ఇక్కడే నిర్వహించేలా ప్లాన్ చేసారట. ఏదైమైనా అల్లు వారి ఫ్యామిలీ ఒకవైపు సినిమాల నిర్మాణం, మరోవైపు ఓటీటీలతో ఫుల్ బిజీగా ఉన్నారు. వాటికీ ధీటుగా ఇపుడు స్టూడియో రంగంలోకి అడుగుపెట్టడం చూస్తుంటే.. అల్లు ఫ్యామిలీ మంచి ప్లానింగ్‌తోనే ఈ రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్టు స్పష్టమవుతుంది. అల్లురామలింగయ్య వ్యవస్ధాపకులుగా స్టాపించిన గీతాఆర్ట్స్ బ్యానర్‌లో గత 50 సంవత్సరాలుగా అనేక చిత్రాలు నిర్మితమైన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో అల్లు అరవింద్ మరో స్టెప్ ముందుకేసి అల్లు స్టూడియోస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.