జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘటనపై.. అల్లు అరవింద్ స్పందించారు. ఈ దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇలాంటి వాటిని ఎవరూ ప్రోత్సహించవద్దని.. ఇలాంటి దుశ్చర్యలకు ఎవరూ ప్రేరేపించవద్దని కోరారు. ఇప్పుడు అన్ని విషయాలు చాలా సున్నితంగా ఉన్నాయని… ఆ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలని అన్నారు.
ఇప్పుడు మనం సంయమనం పాటించాల్సిన సమయం. ఎవరూ తొందరపాటు చర్యలు తీసుకోవద్దని అరవింద్ కోరారు. అందరూ ఓపిక ఓపికగా ఉండాలనన్నారు.. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అక్కడి నుంచి తీసుకెళ్లారని.. మళ్లీ ఎవరైనా గొడవ చేయడానికి వచ్చినా అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని అల్లు అరవింద్ అన్నారు.