హైదరాబాద్: సినీ నటుడు అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేసిన అనంతరం అల్లు అర్జున్ ను నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. వాదనలు విన్న న్యాయస్థానం అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధించింది.
చంచల్‌గూడ జైలు వద్ద భారీ బందోబస్తు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలో ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. నాంపల్లి కోర్టు నుంచి నేరుగా ఆయనను చంచల్ గూడకు జైలుకు తీసుకెళ్లారు పోలీసులు .
- Advertisement -