సంధ్య థియేటర్ దగ్గర మాత్రం షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటో దిల్‌షుఖ్ నగర్ కు చెందిన రేవతి (39) మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ అపస్మారక స్థితికి వెళ్లాడు. కాగా, శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఇక తాజాగా శ్రీ తేజ గురించి అల్లు అర్జున్ ట్విట్టర్ వేదిక స్పందించారు. ‘‘దురదృష్టకర సంఘటన తర్వాత నిరంతరం వైద్య సంరక్షణలో ఉన్న చిన్నారి శ్రీ తేజ్ గురించి నేను చాలా ఆందోళన చెందుతున్నాను. ప్రస్తుతం కొనసాగుతున్న చట్టపరమైన చర్యల కారణంగా, ఈ సమయంలో శ్రీతేజ్, అతని కుటుంబాన్ని సందర్శించవద్దని నాకు సూచించారు.
నా ప్రార్థనలు వారితోనే ఉన్నాయి. వైద్యం, కుటుంబ అవసరాలను తీర్చడానికి నేను బాధ్యత వహించడానికి కట్టుబడి ఉన్నాను. శ్రీ తెజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. వీలైనంత త్వరగా శ్రీ తేజ్‌ని అతని కుటుంబంతో కలవాలని ఎదురుచూస్తున్నాను” అని రాసుకొచ్చారు.