Saturday, December 14, 2024

Breaking | సంధ్య థియేటర్ లో తొక్కిసలాట.. అల్లు అర్జున్ అరెస్ట్

పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ లోని చిక్కడపల్లిలో ఉన్న సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట కేసులో హీరో అల్లు అర్జున్ ను నేటి ఉదయం చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.

ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు ఘటన వివరాలను అందించి ఐకాన్ స్టార్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో థియేటర్ యజమానితో పాటు అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇక మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు బ‌న్నీపై ఇప్పటికే నమోదు చేశారు. ఆయ‌న‌పై పోలీసులు బీఎన్ఎస్ 105, 118 సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు. తాజాగా ఈ కేసులో చిక్కడ పల్లి పోలీసులు అల్లు అర్జున్ ఇంటికెళ్లి ఆయ‌న్న అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం చిక్కడపల్లి పీఎస్‌కు త‌ర‌లించారు. ఈ ఘటనలో పోలీసులు ఇప్ప‌టికే సెక్యూరిటీగార్డ్‌ సహా థియేటర్‌ యజమాన్యానికి చెందిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. 

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement