Wednesday, December 18, 2024

Allu Aravind | శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్..

పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా… అక్కడే గాయపడిన ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ఈ నేపథ్యంలో అల్లు అరవింద్ కిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్‌ని చూడటానికి వెళ్లాడు. శ్రీ తేజ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అక్కడి వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘‘మృతి చెందిన మహిళ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని తెలిపారు. ప్రభుత్వం మాకు పూర్తి సహకారం అందించింది. కేసు కోర్టులో ఉన్నందున అల్లు అర్జున్ రాలేకపోయాడు. అర్జున్ తరపున నేను ఆసుపత్రికి వచ్చానని చెప్పాడు.’’

Advertisement

తాజా వార్తలు

Advertisement