Tuesday, November 26, 2024

టీఎస్‌ ఈసెట్‌ మొదటి విడత సీట్లు కేటాయింపు… 9వేల సీట్లు భర్తీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టీఎస్‌ ఈసెట్‌ తొలి విడుత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. తొలి విడుతలో ఇంజనీరింగ్‌, ఫార్మసీ కలిపి మొత్తం 12,911 సీట్లలో 9,680 సీట్లను విద్యార్థులకు కేటాయించారు. అందులో 9606 ఇంజనీరింగ్‌ సీట్లు కాగా, 74 ఫార్మసీ సీట్లు ఉన్నాయి. ఇంజినీరింగ్‌ విభాగంలో 82.11 శాతం సీట్లు భర్తీ కాగా, ఫార్మసీ విభాగంలో 6.10 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి.

- Advertisement -

ఈసెట్‌ -2023లో 20,895 మంది అర్హత సాధించగా, 12,953 మంది విద్యార్థులు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. 12,880 మంది విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకోగా, ఇంజినీరింగ్‌ విభాగంలో 9,606 సీట్లు, ఫార్మసీ విభాగంలో 74 శాతం సీట్లు పొందారు. ఇంకా 3,231 సీట్లు మిగిలి ఉన్నాయి. కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు వెబ్‌సైట్‌ నుంచి సీట్‌ అలాట్‌మెంట్‌ ఆర్డర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని, ఈ నెల 12వ తేదీ లోపు ఆన్‌లైన్‌ ద్వారా కళాశాలలో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలి.

లేని పక్షంలో సీటు రద్దు చేయబడుతోంది. అలాట్‌మెంట్‌ ఆర్డర్‌లో పేర్కొన్న ఫీజును క్రెడిట్‌ కార్డు లేదా డెబిట్‌ కార్డు లేదా నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించాలి. అయితే ట్యూషన్‌ ఫీజు చెల్లించే విద్యార్థులు..వారి తల్లిదండ్రుల ఖాతా నుంచి చెల్లిస్తే మంచిదని సూచించారు. ఎందుకంటే రీఫండ్‌ చేసేందుకు సులభంగా ఉంటు-ందని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement