ప్రభన్యూస్ : బీపీఈడీ, యూజీడీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ పీఈసెట్ మొదటి విడత కౌన్సెలింగ్ ఈ నెల 11 నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ గురువారం (నేడు) విడుదల కానుంది. అయితే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ధ్రువపత్రాల పరిశీలనకు ఈనెల 19 వరకు అవకాశం కల్పించారు. ఎన్‌సీసీ, సీఏపీ అభ్యర్థులకు ఫిజికల్ వెరిఫికేషన్‌కు 18 నుంచి 20 వరకు అవకాశం కల్పించినట్లు పీసీసెట్ కన్వీనర్ పి.రమేష్ తెలిపారు. అదేవిధంగా ఈనెల 24 నుంచి 26 వరకు వెబ్ ఆప్షన్లకు గడువు ఇచ్చారు.
మొదటి విడత సీట్లను ఈనెల 27న కేటాయించనున్నారు. 28 నుంచి 30 తేదీల్లో సీటు పొందిన కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలని అధికారులు తెలిపారు. 30 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో మొత్తం 22 కాలేజీల్లో 2210 సీట్లు ఉన్నాయి. వీటిలోని 18 బీపీఈడీ కాలేజీల్లో 1860 సీట్లుంటే, యూ జీడీపీఈడీ కోర్సు ఉన్న నాలుగు కాలేజీల్లో 350 సీట్లు ఉన్నాయి. 1787 మంది బీపీఈడీ కోర్సులో అర్హత సాధించగా, 1207 మంది అభ్యర్థులు యూజీడీపీఈడీ కోర్సులో అర్హత సాధించినట్లు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital