పెగాసస్ తరహా స్పైవేర్ ఎటాక్స్
ముందుగానే ఐ ఫోన్ కంపెనీ మెస్సెజ్ లు
ఒక్కసారి ఎటాక్ చేస్తే మొత్తం డేటా గోవిందా
ఆంధ్రప్రభ స్మార్ట్ – మీరు ఐ ఫోన్. కస్టమర్లా.. ఐ ఫోన్ వాడుతున్నారా.. బీకేర్ ఫుల్.. మీ ఫోన్లలో కొత్త వైరస్ ఎటాక్ జరిగే ప్రమాదం ఉంది.. అది ఎలాంటిది అంటే పెగాసస్ స్పైవేర్ లాంటి నిఘా సాఫ్ట్ వేర్ అన్నమాట.. ఆ స్పైవేర్ మీ ఐ ఫోన్లు టార్గెట్ గా ఉందని , దీని వల్ల మీ డేటాకు.. మీ వ్యక్తిగత సమాచారం భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం.. మీ ఐ ఫోన్లు హ్యాక్ అయ్యే అవకాశం ఉందని యాపిల్ కంపెనీ హెచ్చరించింది. ఐ ఫోన్ కంపెనీ ఇండియాతోపాటు 97 దేశాలకు అలెర్ట్ జారీ చేసింది.
పటిష్ఠమైన భద్రత కలిగిన ఆపరేటింగ్ సిస్టమ్ ను కూడా పెగాసెస్ లాంటి మెర్సినరీ స్పైవేర్ అటాక్ చేయగలదట. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ, సమృద్ధ భారత్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పుష్పరాజ్ దేశ్‌పాండే మైక్రోబ్లాగింగ్ సైట్ ఫోన్లకు ఈ అలెర్ట్ వచ్చింది. వారి ఈ విషయాన్ని ఎక్స్ లో షేర్ చేసుకున్నారు. మెర్సినరీ స్పైవేర్ చాలా ప్రమాదరమైనది. అత్యాధునికమైనదని నిపుణులు హెచ్చిరిస్తున్నారు. మెర్సినరీ స్పైవేర్ డివైస్ లోని మీ మొత్తం డేటా, కార్యకలాపాలను హ్యాక్ చేసే హ్యాకర్స్ చేతిలో పెడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకునే ఆపిల్ కంపెనీ హెచ్చరికలు జారీ చేసింది.