Friday, November 22, 2024

వికీలీక్స్ వ్య‌వ‌స్థాప‌కుడి పై గూఢ‌చ‌ర్యం ఆరోప‌ణ‌లు-అమెరికాకి అప్ప‌గించ‌నున్న బ్రిట‌న్

వికీలీక్స్ వ్య‌వ‌స్థాప‌కుడు జూలియ‌న్ అసాంజేను అమెరికాకి అప్ప‌గించాల‌నే నిర్ణ‌యానికి బ్రిట‌న్ స‌ర్కార్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. కాగా జూలియ‌న్ అసాంజే గూఢ‌చ‌ర్యం ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నాడు. ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్ యుద్ధాలకు సంబంధించిన కీలక పత్రాలను లీక్ చేసినట్టు వికీలీక్స్ పై ఆరోపణలు ఉన్నాయి. ఆస్ట్రేలియన్ పౌరుడైన 50 ఏళ్ల అసాంజేను అమెరికాకు అప్పగించే క్రమంలో ముఖ్యమైన ఫైలుపై బ్రిటన్ హోంమంత్రి ప్రీతి పటేల్ సంతకం చేశారు. అంతకుముందు, అసాంజేను అమెరికాకు అప్పగించే వ్యవహారం కింది కోర్టుల నుంచి సుప్రీంకోర్టుల వరకు అనేక దశల్లో అప్పీలుకు వెళ్లింది. జూన్ 17న మేజిస్ట్రేట్ కోర్టుతో పాటు హైకోర్టు కూడా అసాంజే అప్పగింతపై ప్రభుత్వానికి అనుకూల తీర్పులు ఇచ్చాయని బ్రిటన్ హోంమంత్రిత్వ శాఖ కార్యాలయం అధికార ప్రతినిధి వెల్లడించారు. అయితే, ఈ కోర్టు తీర్పులపై అప్పీల్ చేసుకునేందుకు అసాంజేకు 14 రోజుల సమయం ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో, అసాంజే బృందం మరోసారి అప్పీల్ చేసే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement