Tuesday, November 26, 2024

అల్ల‌రి న‌రేష్ కొత్త రూపం ఉగ్రం..

‘అల్లరి’ నరేష్‌ హీరోగా విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఉగ్రం’. ‘నాంది’ వంటి సక్సెస్‌ తర్వాత ఈ ఇద్ద రి కాంబినేషన్‌ లో వస్తున్న రెండో చిత్రమిది. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్నారు. సమ్మర్‌లో సిని మాను విడుదలకు సన్నాహాలు చేస్తు న్నారు. బుధవారం చిత్ర బృందం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో నాగ చైతన్య టీ-జర్‌ ని విడుదల చేశారు.
తూమ్‌ వెంకట్‌ కథ అందించగా, అబ్బూరి రవి కొన్ని సంభాషణలు రాశారు. సిద్‌ సినిమాటోగ్రఫీ అందించారు. శ్రీచరణ్‌ పాకాల తన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అదనపు బలాన్ని తెచ్చారు. ఛోటా కె ప్రసాద్‌ ఈ చిత్రానికి ఎడిటర్‌, బ్రహ్మ కడలి ప్రొడక్షన్‌ డిజైనర్‌.
ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ ”ఉగ్రం టీ-జర్‌ చూసిన వెంటనే అదిరిపోయింది అనిపించింది. నరేష్‌ గారిని చూసి స్టన్‌ అయిపోయాను. అల్ల రితో మొదలుపెట్టి ఉగ్రంతో వస్తు న్నారు. ఇదొక అద్భుతమైన ప్ర యాణం. ” అని అన్నారు.


నరేష్‌ మాట్లాడుతూ ”ఒక నటు-డిని దర్శకుడు ఎంత నమ్మితే అన్ని మంచి విజయాలు వస్తాయి. మా నాన్నగారు నన్ను నమ్మినపుడు వరుస విజయాలు వచ్చాయి. క్రిష్‌ నమ్మినపుడు గమ్యం, సము ద్రఖని నమ్మినపుడు శంభో శివ శంభో ఇలా మంచి సినిమా లు వచ్చాయి. దీని తర్వాత నాందితో విజయ్‌ గారు నాకు కొత్త రూటు- చూపించారు. నాది కానీ రోజు కూడా నేను ఇలానే నిలబడతా అనే మాట ఉగ్రం టీ-జర్‌ లో వుంది. విజయ్‌ కూడా నాది కాని రోజు నిలబడ్డారు. నేను అలానే నిలబడతా.” అన్నారు. విజయ్‌ కనకమేడల మాట్లాడుతూ.. నిజాయితీగా సినిమా తీస్తే ప్రేక్షకులు ఎంతగొప్పగా ఆదరిస్తారో నాంది విజయం చూపించింది. ఉగ్రం కూడా అంతే నిజాయితీగా వుంటు-ంది. ” అన్నారు.
అబ్బూరి రవి మాట్లాడుతూ ”ఉగ్రం ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతిని ఇచ్చే సినిమా. మనకు తెలియ కుండానే కన్నీళ్ళు వచ్చే సినిమా, ఆనందం ఇచ్చే సినిమా, కోపం తెప్పించే సినిమా.” అన్నారు. ఈ వేడుకలో మిర్నా, సాహు గారపాటి వెంకట్‌, చోటా కే ప్రసాద్‌, బ్రహ్మ కడలి, సిద్‌, శ్రీ చరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement