బీజేపీ కేవలం రిబ్బన్ కటింగ్‌లకే ప్రాధాన్యం ఇస్తుందని, ఈ అలవాటు వారికి మాత్రమే ఉందని సమాజ్‌వాదీ పార్టీ నేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ విమర్శించారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుతం ప్రారంభిస్తున్న అన్ని ప్రాజెక్టులు.. తాము అధికారంలో ఉన్నప్పుడు నిర్మించివనే అన్నారు. పనులు చేసింది తాము అని.. బీజేపీ తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. మోడీ ప్రభుతానికి ప్రకటనలు చేయడం తప్ప.. పనులు చేయడం చేతకాదని ఆరోపించారు. ప్రాజెక్టుల కంటే ఎక్కువ ఖర్చు.. వారి ప్రకటనలకే అవుతుందని విమర్శించారు.
2022లోపు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని, అది వాస్తవంలో జరిగిందా..? అని ప్రశ్నించారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని.. అవి ఎక్కడ ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. సమాజ్‌వాదీ పార్టీ విద్యార్థులకు లాప్‌టాప్‌లు ఇస్తే.. బీజేపీ వారిపై లాఠీ చార్జీ చేసిందని విమర్శించారు. పేదలకు లోహియా ఆవాస్ యోజన కింద ఇళ్లు నిర్మించి ఇస్తే.. బీజేపీ రైతులను రోడ్లపైకి ఈడ్చి తొక్కించి చంపిందని విమర్శించారు. ఎస్‌పీ అభివృద్ధిని నమ్మితే.. బీజేపీ హింసను నమ్మతుందని ఆరోపించారు. పేర్లు మార్చడం కూడా బీజేపీకి అలవాటైందన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital