Friday, November 22, 2024

రాజ‌కీయాల‌కు అతీతంగా అన్ని రాష్ట్రాల‌ను ప్రోత్స‌హించాలి : మంత్రి కేటీఆర్

రాజ‌కీయాల‌కు అతీతంగా అన్ని రాష్ట్రాల‌ను ప్రోత్స‌హించాల‌ని, రాష్ట్రం బ‌లంగా ఉంటేనే దేశం బ‌లంగా ఉంటుంది రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్ర‌గ‌తిశీల రాష్ట్రాల‌ను ప్రోత్స‌హించాలే త‌ప్ప అణ‌గ‌దొక్క‌కూడ‌ద‌న్నారు. కేంద్రం మంచి ప‌ని చేస్తే మెచ్చుకుంటాం.. చెడ్డ ప‌ని చేస్తే విమ‌ర్శిస్తాం అని చెప్పారు. ఎన్నిక‌ల స‌మ‌యంలోనే రాజకీయ వ్యూహాలు చేయాల‌ని కేటీఆర్ సూచించారు. తెలంగాణ ప‌రిశ్ర‌మ‌ల శాఖ వార్షిక నివేదిక‌ను రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. టీఎస్ ఐపాస్ ద్వారా రూ. 2.32 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు వ‌చ్చాయ‌ని తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు 16.48 ల‌క్ష‌ల మందికి ఉద్యోగాలు వ‌చ్చాయ‌న్నారు. వీధి వ్యాపారుల‌కు సౌక‌ర్యాల క‌ల్ప‌న‌పై ప్ర‌త్యేక దృష్టి సారించామ‌న్నారు. రాష్ట్రాన్ని పెట్టుబ‌డుల కేంద్రంగా మార్చేందుకు అనేక చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. 6 పారిశ్రామిక కారిడార్‌ల‌కు ప్ర‌తిపాద‌న‌లు పంపినా కేంద్రం నుంచి స్పంద‌న లేద‌ని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. విభ‌జ‌న చ‌ట్టంలోని పారిశ్రామిక ప్రోత్సాహ‌కాల‌ను ఇంకా ఇవ్వ‌లేద‌ని మండిప‌డ్డారు. గుజ‌రాత్‌లో గిఫ్ట్ సిటీ పెట్టండి.. ఇత‌ర రాష్ట్రాల‌కూ గిఫ్ట్ ఇవ్వండి. స‌బ్ కాసాత్, స‌బ్ కా వికాస్‌ను కేంద్రం చేత‌ల్లో చూపాల‌న్నారు. ఎన్నిక‌లు లేన‌ప్పుడు దేశాభివృద్ధే ప్ర‌ధాన అజెండా కావాల‌ని చెప్పారు. నిత్యం రాజ‌కీయాలు చేస్తే ఎప్ప‌టికీ మూడో ప్ర‌పంచ దేశంగా ఉంటామ‌ని స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement