Wednesday, November 27, 2024

All Safe – సముద్రంలో చిక్కుకున్న మత్య్యకారులు …. సకాలంలో స్పందించిన అధికారులు

మత్స్యకారులను రక్షించిన అధికారులు
వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకుపోయిన జాలర్లు
సకాలంలో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం, కలెక్టర్
తొమ్మిది మందిని రక్షించి కృష్ణపట్నం పోర్టుకు తరలింపు

తిరుపతి ప్రతినిధి (ఆంధ్రప్రభ): సముద్రంలో చిక్కున్న మత్స్యకారులను జిల్లా యంత్రాంగం రక్షించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏర్పడిన సంగతి తెలిసిందే. దీని ప్రభావం వలన ఈ నెల 26 నుంచి 28 వరకు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులను సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని జిల్లా యంత్రాంగం హెచ్చరించింది.

అయితే నెల్లూరు జిల్లా బోగోలు మండలం పాతపాలెం, చెన్నరాయునిపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారులు సీహెచ్ రమేష్, కె.ఏడుకొండలు, కె.చిట్టిబాబు, కె.తిరుపతి, వి.హరి బాబు, వై.అరవండి, కె.వెంకట రమణయ్య, సీ.హెచ్ శివాజీ, ఏ.తిరుపతి తొమ్మిది మంది మత్స్యకారులు మెకనైజేడ్ పడవలో సోమవారం చేపల వేటకు వెళ్లారు. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని వడపాలెం, వైటీ కుప్పం మధ్య సముద్రంలో 14 కిలో మీటర్ల దూరంలో బోట్ ఇంజను పాడైపోయింది. దీంతో జాలర్లు సముద్రంలో చిక్కుకుపోయారు.

- Advertisement -

సమాచారం అందుకున్న కలెక్టర్ వెంటనే ప్రభుత్వ ఉన్నతాధికారులతో సంప్రదించారు. కృష్ణపట్నం పోర్టు వారి సహకారంతో వెంటనే పెద్ద పడవల సాయంతో సముద్రంలో చిక్కకున్న మత్య్సకారుల వద్దకు వెళ్లి బోట్‌తో సహా వారిని బుధవారం ఉదయం 10 గంటలకు కృష్ణపట్నం తరలించారు. ఈ సందర్భంగా మత్స్యకారులు ప్రభుత్వానికి, కలెక్టర్‌, అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement