చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు మళ్లీ ఎంట్రీ దొరికింది. నాగ్‌పూర్‌లో టీమిండియా, ఆస్ట్రేలియ మధ్య జరగనున్న తొలి టెస్టులో పాల్గొనేందుకు పర్మిషన్ వచ్చింది. జాతీయ క్రికెట్ అకాడమీ (NCA) అతనికి క్లియరెన్స్ & ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇచ్చింది. ఫిట్‌నెస్ క్లియరెన్స్‌తో జడేజాను జట్టులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
గత ఏడాది ఆగస్టులో దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్‌లో రవీంద్ర జడేజా చివరిసారిగా దేశం తరఫున ఆడాడు. ఇక మోకాలి గాయం కారణంగా అతను ఐదు నెలల పాటు ఆటకు దూరంగా ఉన్నాడు. కాగా, గత వారం జరిగిన రంజీ ట్రోఫీతో జడేజా తిరిగి ఆట ప్రారంభించాడు. ఇక.. నాగ్‌పూర్ టెస్టు ఆడేందుకు జడేజాకు అనుమతి లభించగా, అయ్యర్ తొలి టెస్టుకు ఇంకా సందేహమే అని చెప్పాలి. అతనికి వెన్ను గాయంతో న్యూజిలాండ్ సిరీస్‌కు దూరమయ్యాడు. కాగా, అతను ప్రస్తుతం NCA పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు.