ఢిల్లీ పాలన వ్యవహరాలపై సుప్రీంకోర్టు గురువారంనాడు కీలక తీర్పును వెల్లడించింది. ఢిల్లీ సర్కార్ కు అధికారాలు లేవన్న గత తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఎన్నికైన ప్రభుత్వానికి అసలైన అధికారాలు ఉండాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఎన్నికైన ప్రభుత్వ నిర్ణయాలకు లెఫ్టినెంట్ గవర్నర్ కట్టుబడి ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. శాంతి భద్రతలు మినహా మిగిలిన అంశాలపై ఢిల్లీ ప్రభుత్వానికే నియంత్రణ ఉంటుందని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. ఏకగ్రీవ తీర్పును వెలువరించింది సుప్రీంకోర్టు ధర్మాసనం. 2019 నాటి సింగిల్ జడ్జి తీర్పుతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకీభవించలేదు. ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ వివాదంపై సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పును వెల్లడించింది. ఢీల్లీలో పాలన వ్యవహరాలు ఎవరు చూడాలన్న విషయమై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. ఢిల్లీ పాలన వ్యవహరాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ అనవసరంగా జోక్యం చేసుకోవద్దని కూడా సుప్రీంకోర్టు సూచించింది. ఒక్క శాంతి భద్రతల అంశం మినహా మిగతా అన్ని పాలనాకారాలు ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వాధినేతకే ఉంటుందని తేల్చి చెప్పింది..
Advertisement
తాజా వార్తలు
Advertisement