Friday, November 22, 2024

అయిదు రాష్ట్రాల‌లో యూత్ మంత్రం…

ఆంధ్ర‌ప్ర‌భ ప్ర‌త్యేక క‌థ‌నం..
291 పేర్లతో టీఎంసీ జాబితా
80 ఏళ్లు పైబడిన వారికి చెక
ఆ దిశగానే రాహుల్‌ ప్రచారం
లెఫ్ట్‌ ఫ్రంట్స్‌లో యూత్‌ కొరత

న్యూఢిల్లీ : పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్‌, తమిళనా డుతో పాటు అసోంలో ఎన్నికల వాతావరణ వేడెక్కింది. ఈ సారి అన్ని పార్టీలు సరికొత్త పంతాను ఎంచుకున్నాయి. యువతకు అత్యధిక సీట్లు కేటాయించాలని నిర్ణయించాయి. ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ తన జాబితాను విడుద ల చేయగా.. లెఫ్ట్‌ ఫ్రంట్‌ నేడో.. రేపో ప్రకటించే అవకాశం ఉం ది. రాహుల్‌ గాంధీ కూడా యువతను రాజకీయాల్లో తీసుకొ చ్చేలా ప్రచారం చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో దాదాపు సగానికి పైగా కాంగ్రెస్‌ టికెట్లు యువతకే కేటాయించేందుకు సిద్ధమ వుతోంది. ఆ దిశగా భాగస్వాములతో చర్చలు జరుపుతోంది.
ప.బెంగాల్‌లో కొలిక్కిరాని సీట్ల రగడ
కేరళను శాసిస్తున్న కమ్యూనిస్టులకు ఇటు పశ్చిమ బెంగాల్‌ లో కొంత ఉనికి తగ్గుతోంది. ఎలాగైనా అధికారం చేజిక్కించు కోవాలన్న ధృడ నిశ్చయంతో బీజేపీ ఉంది. టీఎంసీ 291 మందితో జాబితాను ప్రకటించగా.. యువతకు దీదీ ప్రాధా న్యత ఇచ్చారు. అందులోనూ మహిళలకు 50 సీట్లు కేటా యించారు. దీంతో పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌, సీపీఎం, అబ్బాసుద్దీన్‌ సిద్దిఖీ పార్టీ ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌ మధ్య సీట్ల సర్దుబాటుపై తీవ్ర చర్చే జరుగుతోంది. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కూడా యువతకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో పశ్చిమ బెంగాల్‌ లెఫ్ట్‌ ఫ్రంట్‌లో యువతకు ప్రాధాన్యం దక్కుతుందా.. లేదా అనేది ప్రశ్నార్థ కంగా మారింది. 80 ఏళ్లు పైబడిన వారికి టీఎంసీ టికెట్‌ నిరాకరించింది. నేడో.. రేపో లెఫ్ట్‌ ఫ్రంట్‌ జాబితా విడు దల చేసే అవకాశం ఉంది. సీపీఎం ఎక్కువ సీట్లు ఆశిస్తూ.. తక్కువ మంది యువతకు అవకాశం ఇవ్వనున్నట్టు సమాచారం.
యూత్‌కు అవకాశం దక్కేనా..!
ఐఎస్‌ఎఫ్‌ 92 సీట్లు కేటాయించాలని పట్టుబట్టింది. ఇది కుదరని కాంగ్రెస్‌ వాదిస్తోంది. 294 నియోజకవర్గాలు కలిగిన ప.బెంగాల్‌ అసెంబ్లిdలో 145 స్థానాల్లో పోటీ చేసేందు కు సీపీ ఎం పట్టుబడుతోంది. అయితే దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటికే లెఫ్ట్‌ ఫ్రంట్‌ భాగస్వాములు.. ఐఎస్‌ఎఫ్‌ కోసం 30కిపైగా సీట్లను వదులుకుంది. దీదీ నిల్చున్న నందీగ్రామ్‌ సీటును తమకు అప్పగించాలని ఐఎస్‌ ఎఫ్‌ డిమాండ్‌ చేస్తోంది. 2016 ఎన్నికల్లో 92 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌.. 44 స్థానాల ను దక్కించుకుంది. 148 స్థానాల్లో పోటీ చేసిన సీపీఎం కేవలం 26 స్థానాల్లో విజ యం సాధించింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఏకంగా 211 స్థానాలను కైవసం చేసుకు ని.. పాగా వేసింది. లెఫ్ట్‌ ఫ్రంట్‌లో భాగస్వామి.. ఫార్వర్డ్‌ బ్లాక్‌, 2016లో 25 స్థానాలు ఇస్తామని చెప్పి.. చివరికి 16కే పరిమితం చేశారు. ఈ సారి 18 స్థానాల్లో పోటీ చేస్తామని ఫార్వర్డ్‌ బ్లాక్‌ తేల్చి చెబుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement