Friday, November 22, 2024

కర్నాటక బిజెపి మ్యానిఫెస్టోలో ఉచితాల గానం – గ్యాస్, పాలు, టిఫిన్, భోజనంతో సహ అన్నీ ఫ్రీనే…

బెంగుళూరు – కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు కన్నడిగులకు వరాల జల్లు కురుపిస్తున్నాయి. ఇప్పటికే జేడీఎస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే పేదలకు ఆరు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు అందిస్తామని, ఆటో డ్రైవర్లు, మహిళలు, సెక్యూరిటీ గార్డులు, రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చింది. తాజాగా బిజెపి కార్మికుల దినోత్సవం మే 1వ తేదీన సోమవారం బెంగళూరులోని ఓ ప్రైవేట్ హోటల్ లో కర్ణాటక ఎన్నిలక మేనిఫెస్టోను విడుదల చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, సీఎం బసవరాజ్ బోమ్మయ్, మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప తదితరులు ఎన్నికల మేనిఫేస్టో విడుదల చేశారు.

ఈ సందర్బంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలాగా మేము తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చెయ్యలేమని. మేము చేసే పనులనే బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలు వివరించామని అన్నారు. కర్ణాటకలోని 224 అసెంబ్లీ నియోజక వర్గాల్లోని ప్రజల అభిప్రాయాలు సేకరించి ఎన్నికల మేనిఫెస్టో తయారు చేశామని సీఎం బసవరాజ్ బోమ్మయ్ అన్నారు.* బీపీఎల్ రేషన్ కార్డులు ఉన్న ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు అందిస్తామని బీజేపీ నాయకులు చెప్పారు.* బీపీఎల్ రేషన్ కార్డులు ఉన్న ప్రతి కుటుంబానికి ప్రతిరోజు ఉచితంగా అర్దలీటర్ నందిని పాలు అందిస్తామని అన్నారు.* ప్రతినెల 5 కేజీల సిరిధాన్యాలు ఉచితంగా అందిస్తామని బీజేపీ ఎన్నికల హామీ ఇచ్చింది.

అటల్ బిహారి వాజ్ పేయి పేరుతో ప్రతివార్డులో ఆహార కేంద్రాలు ఏర్పాటు చేసి తక్కువ ధరకు నాణ్యమైన భోజనం, టిఫిన్లు అందిస్తామని అన్నారు.* ఇళ్లులేని నిరుపేదలకు పక్కా ఇండ్లు క్టిస్తామని బీజేపీ నాయకులు హామీ ఇచ్చారు.* సామాజిక న్యాయ నిధి పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ మహిళల పేరుతో రూ. 10,000 ఫిక్సెడ్ డిపాజిట్ చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. సీనియర్ సిటిజన్లకు ప్రతి సంవత్సరం ఉచిత వైద్యపరీక్షలు చేయిస్తామని, అందుకు అయ్యే ఖర్చు బీజేపీ ప్రభుత్వమే భరిస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement