లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 13 ఎంపీ సీట్లు వస్తాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు ముగిశాయని… ఇక తన దృష్టి అంతా పరిపాలన పైనే అని తెలిపారు. తన ప్రపంచం అంతా తెలంగాణనే అని అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి… వంద సంవత్సరాలకు కావాల్సిన ప్రణాళిక అందించడమే తన లక్ష్యమని తెలిపారు.
మాజీ సీఎం కేసీఆర్ ఇష్టానుసారంగా జిల్లాలు ఏర్పాటు చేశారని మండిపడ్డారు. కోటి జనాభా ఉన్న హైదరాబాద్‌కి, ఒక్క నియోజకవర్గం ఉన్న వనపర్తిని ఒక జిల్లాగా ఏర్పాటు చేశారని చెప్పారు. మండలాలు, రెవెన్యూ డివిజన్లను క్రమబద్ధీకరణ చేయాలని.. ఆ తర్వాత జిల్లాల ఏర్పాటు ఉంటుందని స్పష్టం చేశారు. పాలమూరుపై ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అందుకే స్పెషల్‌గా పాలమూరు జిల్లా ఇరిగేషన్ ఆఫీసర్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు.