Tuesday, November 26, 2024

“హర్ ఘర్ తిరంగా” సకల ఏర్పాట్లు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ ఏడాది ఆగస్టు 15న నిర్వహించనున్న స్వాతంత్ర దినోత్సవం రోజు దేశంలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేసేలా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు. టీఆర్ఎస్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి సోమవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చిన కేంద్ర మంత్రి, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ కార్యక్రమాల్లో భాగంగా “హర్ ఘర్ తిరంగా” పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమం కోసం ఆగస్టు మొదటివారం వరకు జెండాలను అందుబాటులో ఉంచేలా ప్రయత్నాలు చేస్తున్నాని తెలిపారు.

స్వయం సహాయక బృందాలను కూడా భాగస్వామ్యులను చేస్తూ జాతీయ జెండాల రూపకల్పన జరుగుతోందని, ఈ-కామర్స్ పోర్టళ్లతో పాటు ప్రభుత్వ రంగ పోర్టళ్లలోనూ వీటిని అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. ప్రజలు వీటిని కొనుగోలు చేసి స్వాతంత్ర దినోత్సవం నాడు తమ ఇళ్ల వద్ద జెండాను ఎగురవేసేలా ప్రోత్సహిస్తున్నామని కిషన్ రెడ్డి వెల్లడించారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement