దేశంలో అలాగే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే తిరుమలలో దర్శనం చేసుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే సాధారణంగా ఎక్కువగా భక్తులు అలిపిరి కాలినడక మార్గం ద్వారా కొండకు చేరుకుంటూ ఉంటారు. అయితే మేలో అలిపిరి కాలినడక మార్గాన్ని మూసేసి మరమ్మతులు చేయడానికి నిర్ణయించింది టీటీడీ. రెండు నెలల్లోనే ఈ మరమ్మతులు పూర్తి చేసి తిరిగి ప్రారంభించాలని అనుకున్నారు.
కానీ అనుకున్న సమయానికి పనులు పూర్తి కాకపోవడంతో మరో రెండు నెలలపాటు అలిపిరి కాలినడక మార్గాన్ని మూసివేస్తున్నట్లు టిటిడి నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ లో ఈ మరమ్మతులు పూర్తి చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. అయితే కాలి నడక మార్గం ద్వారా వెళ్లాలి అనుకునేవారు శ్రీవారి మెట్ల మార్గాన్ని వినియోగించుకోవాలని తెలియజేశారు అధికారులు.