ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిము యూనివర్శిటీ(ఏఎంయూ) తన అవసరాల కోసం సొంతంగా ఒక ఉపగ్రహాన్ని రూపొందించుకొని ప్రయోగించే పనులకు ఇటీవల నాంది పలికింది. ఏఎంయూ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి కేంద్ర అంతరిక్ష విభాగానికి చెందిన భారత జాతీయ అంతరిక్ష కార్యక్రమాల ప్రోత్సాహం, అధీకృత కేంద్రం(ఇన్‌స్పేస్) ఆమోదం తెలిపింది. తొలిసారిగా చేపట్టిన ఉపగ్రహ కార్యక్రమానికి ఏఎంయూ వ్యవస్థాపకుడు సర్ సయీద్ అహ్మద్ ఖాన్‌కు గుర్తుగా ‘ఎస్‌ఎస్ ఏఎంయూ శాట్’ అని పేరు పెట్టారు. వచ్చే ఆరు మాసాల్లో ఉపగ్రహాన్ని ప్రయోగిస్తామని ఏఎంయూ వర్గాలు తెలిపాయి.
- Advertisement -