ప్రపంచ వ్యాప్తంగా టెక్ కంపెనీలతో పాటు, ఇ-కామర్స్ సంస్థలు కూడా పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇందుకు భిన్నంగా చైనాకు చెందిన ఇ-కామర్స్ టెక్ కంపెనీ అలీబాబా ఈ ఆర్ధిక సంవత్సరంలో 15000 మందిని ఉద్యోగులను తీసుకుంటాని ప్రకటించింది. భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వస్తున్న వార్తలను అలీబాబా త్రోసిపుచ్చింది. తొలగించడం కాదు, కొత్తగా రిక్రూట్ చేసుకుంటున్నామని కంపెనీ వెల్లడించింది. అలీబాబా క్లౌడ్ విభాగంలో మాత్రం 7 శాతం ఉద్యోగులను తగ్గిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అలీబాబాలో ఉన్న 6 విభాగాల్లోకి కొత్తగా 15 వేల మందికి ఉద్యోగులను తీసుకుంటామని తెలిపింది. వీరిలో 3వేల మంది ప్రెషర్స్ ఉంటాని పేర్కొంది.
ఈ సంవత్సరం మార్చి నాటికి కంపెనీలో 2,35,000 మంది ఉద్యోగులు ఉన్నారు. మార్చి తరువాత అలీబాబా గ్రూప్‌ను 6 సంస్థలుగా విడదీసింది. క్లౌడ్ ఇంటెలిజెన్స్ గ్రూప్, టావోబావో టిమాల్ కామర్స్ గ్రూప్, లోకల్ సర్వీసెస్ గ్రూప్, కైనియానో స్మార్ట్ లాజిస్టిక్స్ గ్రూప్, గ్లోబల్ డిజిటల్ కామర్స్ గ్రూప్, డిజిటల్ మీడియా అండ్ ఎంటర్‌టైన్మెం ట్ గ్రూప్ గా మొత్తం ఆరు గ్రూప్‌లుగా విభజించింది. ప్రతి గ్రూప్‌కు సొంత సీఈఓ, బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారని తెలిపింది.