షాంగై – ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుంటే చైనాకు చెందిన ఇ-కామర్స్ దిగ్గజం అలీబాబా మాత్రం భారీ ఎత్తున కొత్త ఉద్యోగులను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. మొత్తం ఆరు విభాగాల్లో 15 వేల మందిని విధుల్లోకి తీసుకోనున్నట్లు తెలిపింది. వీరిలో మూడు వేల మంది ఇటీవల గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నవారిని తీసుకుంటామని పేర్కొంది. మరోవైపు అలీబాబా ఉద్యోగులను తొలగించనున్నట్లు వస్తున్న వార్తలను కంపెనీ ఖండించింది. అయితే, అలీబాబా క్లౌడ్ డివిజన్ మాత్రం 7 శాతం ఉద్యోగులను తొలగించింది. మిగిలిన విభాగాలలో మానవ వనరులను ఉపయోగించుకుంటామని ప్రకటిస్తూ , ఉద్యోగ నియామక ప్రక్రిక కొనసాగుతుందనే శుభవార్తను వినిపించింది..
Advertisement
తాజా వార్తలు
Advertisement