బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియాభట్ బేబి గర్ల్ కి జన్మనిచ్చారు. దీంతో అలియా భట్ కి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. అలియా తల్లి అయ్యారని తెలుసుకున్న అభిమానులు, చిత్ర ప్రముఖులు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తున్న రన్బీర్ కపూర్-అలియా 2022 ఏప్రిల్ 14న వివాహం చేసుకున్నారు. పెళ్ళైన రెండు నెలలకే అలియా తాను గర్బవతిని అయ్యానని ప్రకటించారు. అంత తక్కువ సమయంలో అలియా ప్రెగ్నెంట్ కావడం విశేషంగా మారింది. ఈ వార్తను మీడియా ప్రముఖంగా ప్రచురించింది. నవంబర్ 6న అలియా ఆడపిల్లకు జన్మను ఇచ్చారు. తల్లీ బిడ్డా ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం . అలియా భట్ ఆర్ ఆర్ ఆర్ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఆర్ ఆర్ ఆర్ మూవీలో రామ్ చరణ్ ప్రేయసి సీత పాత్రలో అలియా కనిపించారు. ఆ విధంగా అలియా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమయ్యారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement