ప్రతి ఆర్ధిక అవసరానికి UPI పేమెంట్ మోడ్ ఎంతో ఉపయోగపడుతోంది. UPI పేమెంట్స్ ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా పాపులారిటీని దక్కించుకుంటున్నాయి. యూపీఐతో బ్యాంక్ అకౌంట్‌ను ఫోన్ నంబర్ లేదా వర్చువల్ పేమెంట్ అడ్రస్ (VPA)కి లింక్ చేసుకోవచ్చు. రాను రాను UPI పేమెంట్స్ చేసేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. నిత్యం కోట్లాది రూపాయలు ఈ పేమెంట్స్ ద్వారా ట్రాన్స్‌ఫర్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి యూపీఐ యాప్స్ వాడుతున్న వారిని అలర్ట్ చేస్తూ బిగ్ అప్ డేట్ ఇచ్చింది కేంద్రం. డిసెంబర్ 31 తర్వాత కొన్ని యూపీఐ ఐడీలు పని చేయవని అంటున్నారు. గత ఏడాది కాలంగా ఎలాంటి లావాదేవీలు చేయని యూపీఐ ఐడీలను ఇనాక్టివ్ ఐడీలుగా పరిగణిస్తూ డిసెంబర్ 31లోపు డీయాక్టివేట్ చేయాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (NPCI) కొద్ది రోజుల క్రితమే పేమెంట్ అప్లికేషన్స్ కి ఆదేశాలు జారీ చేసింది.