పోలవరం, ప్రభన్యూస్ : రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదిలో వరదపోటెత్తుతోంది. ఇవ్వాల (మంగళవారం) పోలవరంలో గోదావరి నీటిమట్టం ఉధృతి మరింత పెరిగింది. ఉదయానికి 15.780 మీటర్లు ఉన్న నీటిమట్టం సాయంత్రానికి 15.887 మీటర్లుగా నమోదయింది. దీంతో పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే ఎగువన 26.920 మీటర్లు స్పిల్‌వే దిగువన 16.720 మీటర్ల నీటిమట్టం నమోదయింది. ఈ క్రమంలో స్పిల్ వే రేడియల్ గేట్ల నుండి , స్లూయిస్ ల నుండి వరద జలాలు దిగువకు విడుదల చేస్తున్నారు.
భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటి మట్టం.
మంగళవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నిటీ మట్ట 20.5 అడుగులకు చేరింది. రేపటి (బుధవారం) వరకు ఇంకా 5 అడుగులు నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని కేంద్ర జల వనరుల శాఖ అంచనా వేసింది. దీనికి తగ్గట్టు అధికారులు లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలని సూచించింది.