Friday, November 22, 2024

UPI | యూజ‌ర్ల‌కు ఎల‌ర్ట్..!! లావాదేవీలు నాలుగు గంట‌లు ఆల‌స్యం

యూపీఐ లావాదేవీలపై త్వరలో కొత్త రూల్ అమల్లోకి రానుంది. ఈ కొత్త నిబంధన ప్రకారం.. యూపీఐ లావాదేవీలు సహా ఇతర పేమెంట్లు ఆలస్యం కానున్నాయి. యూపీఐ ద్వారా ఇద్ద‌రు వ్య‌క్తుల మ‌ద్య జ‌రిగే మొదటి లావాదేవీ రూ.2వేలకు మించి జ‌రిగితే ఆయా లావాదేవీలు క‌నీసం నాలుగు గంటలు ఆలస్యం కానున్నాయి. ఆన్‌లైన్ లావాదేవీలలో మోసాన్ని నిరోధించే ప్రయత్నంలో ఈ కనీస కాలపరిమితిని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.

ఈ విధానంలో డిజిటల్ పేమెంట్లకు కొంత కష్టతరమైనప్పటికీ, సైబర్ సెక్యూరిటీ ఆందోళనలను పరిష్కరించడానికి ఇది తప్పక అవసరమని ప్రభుత్వం భావిస్తున్న‌ట్టు తెలిస్తొంది. ఇన్‌స్టంట్ పేమెంట్ సర్వీసు (IMPS), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (RTGS), యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)తో సహా వివిధ డిజిటల్ పేమెంట్ పద్ధతులకు ఈ నిబంధన వర్తించనుంది.

- Advertisement -

ఈ రూల్ అమల్లోకి వస్తే వినియోగదారుల్లో ఇంతకు ముందెన్నడూ లావాదేవీలు జరపని మరో యూజర్‌కు రూ.2వేల కన్నా ఎక్కువ మొదటి పేమెంట్ చేసినప్పుడు నాలుగు గంటల కాలపరిమితి వర్తిస్తుంది. ఏదైనా పొరపాటుగా లావాదేవీ జరిగినప్పుడు ఆయా లావాదేవీలను రద్దు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement