Saturday, November 23, 2024

తెలంగాణకు అలర్ట్​.. రెండు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : బంగాళాఖాతంపై మరో ఉపరితల ఆవర్తనం 4.5 కిలోమీటర్ల ఎత్తున ఏర్పడిందని, తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని తెలిపారు. వీటి ప్రభావంతోనే వర్షాలు కురుస్తాయని వివరించారు. నిన్న ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల మధ్య అనేక ప్రాంతాల్లో భారీగా వర్షం పడిందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలోని కంగ్టిలో 8.7, మహబూబ్‌నగర్‌లోని కొత్తమొల్గరలో 7.9 సెంటీమీటర్ల వర్షం పడిందని వివరించారు.

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. జార్ఖండ్‌పై మూడు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం నిన్న మధ్యప్రదేశ్‌కి విస్తరించిందని, దానికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement