Friday, November 22, 2024

రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లు రద్దు

కొవిడ్-19 మహమ్మారి వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. అయితే, పరిస్థితి సాధారణ స్థితికి రావడంతో వాటిలో కొన్నింటిని రద్దు చేశారు. మరికొన్ని ప్రత్యేక రైళ్లను యధావిధిగా నడుపుతున్నారు. జూలై 14 నుంచి విశాఖపట్నం-రాయగడ (18528), విశాఖపట్నం-పలాస (18532), విశాఖపట్నం-కిరండోల్ (18551) , జూలై 15 నుంచి రాయగడ-విశాఖపట్నం (18527), పలాస-విశాఖపట్నం (18531, కిరండోల్‌-విశాఖపట్నం (18552) వంటి కొన్ని ప్రత్యేక రైళ్లు రద్దయ్యాయి. అయితే ఈస్ట్ కోస్ట్ రైల్వే రెగ్యులర్ ప్యాసింజర్ రైళ్ల స్థానంలో ప్యాసింజర్ ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది.

విశాఖపట్నం-రాయగడ ప్యాసింజర్ స్పెషల్ (08504) జూలై 15 నుంచి విశాఖపట్నంలో సాయంత్రం 6 గంటలకు బయలుదేరి రాత్రి 10.05 గంటలకు రాయగడ చేరుకుంటుంది. ప్రతిగా రాయగడ-విశాఖపట్నం ప్యాసింజర్ (08503) జూలై 16 నుంచి ఉదయం 5.40 గంటలకు రాయగడలో బయలుదేరి ఉదయం 10 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుందని రైల్వే శాఖ తెలిపింది. విశాఖపట్నం-పలాస ప్యాసింజర్ (08532) జూలై 15 నుంచి విశాఖపట్నంలో సాయంత్రం 5.45 గంటలకు బయలుదేరి రాత్రి 10 గంటలకు పలాస చేరుకుంటుంది. ప్రతిగా పలాస – విశాఖపట్నం ప్యాసింజర్ (08531) జూలై 16 నుంచి ఉదయం 5 గంటలకు పలాసలో బయలుదేరి ఉదయం 9.25 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. విశాఖపట్నం-కిరండోల్ ప్యాసింజర్ (08551) రైలు జూలై 15 నుంచి విశాఖపట్నంలో ఉదయం 6.45 గంటలకు బయలుదేరి రాత్రి 8.45 గంటలకు కిరండోల్ చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో కిరండోల్-విశాఖపట్నం ప్యాసింజర్ (08552) రైలు జూలై 16 నుంచి ఉదయం 6 గంటలకు కిరండోల్‌లో బయల్దేరి రాత్రి 8.20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement